మెదడు చురుకుదనం కోసం

ApurupA
0

  • వయసు పెరిగేకొద్దీ మెదడు చురుకుదనం కోల్పోవడం సహజం. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె నుంచి అన్ని అవయవాలకు రక్తం సాఫీగా సరఫరా అవుతుంది. తద్వార మెదడుకు కావాల్సినంత ప్రాణవాయువు లభించడంతోపాటు కణాలకు జీవశక్తి అందుతుంది.
  • రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరానికే కాదు, మెదడుకూ విశ్రాంతి దొరుకుతుంది. నిద్ర వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • మెదడు చురుగ్గా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. తాజా కూరగాయలు, ఆకుపచ్చటి ఆకుకూరలు, పండ్లు తినాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కోసం చేపలను తినాలి.
  • కొందరు ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. దీనివల్ల మెదడు శక్తిని కోల్పోయి జ్ఞాపకశక్తి లోపిస్తుందని చెబుతున్నాయి పరిశోధనలు. స్నేహబృందాల నెట్‌వర్క్.. మెదడుకు చక్కటి వ్యాయామంలా తోడ్పడుతుంది.
  • అప్పుడప్పుడు మెదడుకు పని చెప్పాలి. కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌గేమ్స్ ఆడొచ్చు. హాస్యచతురత కలిగిన మిత్రత్రయంతో కలవడం వల్ల.. మెదడుకు లాభం చేకూరుతుంది. మెమొరీపవర్ వృద్ధి చెందుతుంది.
  • అధికరక్తపోటు, మధుమేహం, డిప్రెషన్, మానసిక సమస్యలు, ఒత్తిడి.. ఇవన్నీ మెదడును దెబ్బతీస్తాయి. అందుకని ఎప్పటికప్పుడు వీటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top