వర్ష కాలం జాగత్తలు

ApurupA
0
వాతావరణం మారగానే ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే పనికొచ్చే కొన్ని సూచనలు...

  • సిల్కు, షిఫాన్ దుస్తులు వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు ఉతికే శ్రమ, ఆరబెట్టే సమయం ఆదా అవుతాయి.
  • పాదాలు ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది.
  • రాత్రి నిద్రపోయే ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి.
  • తల తడిస్తే వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు, జుట్టు కూడా రాలుతుంది.
  • కొబ్బరినూనెని వెచ్చబెట్టి జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిపడటమే కాదు, జలుబు చేయదు. నూనెతో మర్దనా చేసాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు కూడా పోతుంది.
  • వేడినీళ్లలో నాలుగు  యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు గాని, యూకలిప్టస్ ఆకులు గాని వేసి స్నానం చేస్తే ఈ కాలంలో తరచూ ఇబ్బందిపెట్టే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. అలసట కూడా దూరమవుతుంది.
  • నువ్వుల నూనె రాసుకుని వారానికి ఒకసారి స్నానం చేయటం చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
  • తులసాకురసం, తేనె కలుపుకుని వర్షాకాలంలో అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి అస్తమానూ జలుబు, జ్వరాలు రాకుండా ఉంటాయి.
  • వర్షాకాలంలో జలుబు చేస్తే పంచదారని నిప్పులమీద వేసి వచ్చే పొగని పీల్చండి. జలుబు నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top