నీళ్లతోనే ఆరోగ్యం

ApurupA
0
మనలో చాలామందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టే దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను మెయిన్ టెయిన్ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్ను కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్ రకరకాల తలనెప్పులు, కీళ్లనెప్పులు, కండరాల నెప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది
  • ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు త్రాగాలి. 
  • వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి రెండు గ్లాసుల  నీరు విధిగా తాగాలి. వి
  • మాన ప్రయాణం చేసేటప్పుడు ప్రతీ గంటకూ పావులీటరు నీరు తప్పక తాగాలి. 
  • మంచినీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్ కు గురై అదే సమయంలో మెటబాలిజం రేటే మూడు శాతం వరకూ తగ్గిపోతుంది. 
  • మంచినీరు శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి. షార్ట్ టర్మ్ మెమరీ దెబ్బతింటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు.
  • ప్రతిరోజూ విధిగా 8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి బ్లాడర్ కేన్సర్ సంభవించే అవకాశం తక్కువ. 
  • శరీరానికి నీరు శాతం తగ్గితే శరీర కాంతి కోల్పోతుంది. ముడుతలు పడుతుంది. వదులుగా అయిపోతుంది చర్మం. 
  • కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాల్సి ఉంటుంది. కారణం కాఫీలోని కెఫైన్ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్ కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసు నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి. 
  • ఆహారం తిన్నాక రెండు గంటల అనంతరం నీరు తాగాలి. 
  • హారంతో పాటు, ముద్ద ముద్దకు నీరు తాగడం మంచి పద్ధతి కాదు. 
  • గోళ్లు, జుట్టు, శరీరం అన్నిభాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు 8-10గ్లాసులు వాటర్ తాగాల్సిందే. 
  • కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది. మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండీ ఫిల్టర్ చేసి త్రాగడం మంచి పద్దతి. ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. 
  • ఆహారం వండి వార్చేటప్పుడు, స్నానానికి, పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top