ఎనీమియా (రక్త హీనత) గురించి...

మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 'రక్తహీనత నుంచి బయట పడాలంటే ఆహార నియమాలు పాటించడమే నిజమైన.

రక్తహీనతను ఎదుర్కొంటున్న వారిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఎక్కువగా అలసట చెందటమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయిన భావన కలుగుతుంది. ఎనీమియా గురించి తెలియాలంటే రక్తానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. 

మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ తయారు కావడానికి మాంసకృత్తులు, ఐరన్ ప్రధానంగా అవసరం అవుతాయి. అలా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 16ఎం.జి. పరిమాణంలో ఉంటుంది. ఈ లెక్కన 

మగవారిలో ప్రతి 100గ్రాముల రక్తంలో 13 గ్రా., 

ఆడవారిలో 12 గ్రా.,

6 సంవత్సరాల లోపు పిల్లల్లో 11గ్రా.,

గర్భిణీ స్త్రీలలో 11 గ్రా., 

బాలింతల్లో 12గ్రా., 

7-12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 గ్రా. హిమోగ్లోబిన్ ఉండాలి.

హిమోగ్లోబిన్ ఈ మోతాదు విలువల కన్నా తగ్గితే రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం. రక్తహీనతకు గురైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు సంఖ్య తగ్గిపోతుంది. 

ప్రధానమైన బలహీనత

మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనతలు రక్తం హీనత. అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. 
  1. రక్తం నష్టపోవడం, 
  2. రక్తం ఉత్పత్తిలో ఆటంకం ఏర్పడం, 
  3. పౌష్టికాహారలోపం. 
అయితే, సాధారణ పనులకే ఆయాసం రావడం, బలహీనం, నిరాశక్తత, ఆలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, పాదాల్లో నీరు చేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్ది మంది మగవాళ్లలో కూడా రక్తహీనత సంభవిస్తూ ఉంటుంది

గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 ఏళ్ల వయసుగల మహిళల్లో, పదకొండు సంవత్సరాలలోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. రుతుచక్రం సమయంలో అధిక రక్త స్రావం కావడం వల్ల, పైల్స్ సమస్య వల్ల కూడా ఎనీమియా సంభవించవచ్చు. . 

ఈ రక్తహీనత వల్ల ముఖ్యంగా బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువతో బిడ్బ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడం, వెంటనే వెంటనే రోగాలు రావటం, చదువులో వెనకపడటం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మొదలైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

జాగ్రతలు
  • రక్తహీనత ఉన్నవారు ప్రధానంగా ఆహార నియమాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మహిళలు. ఇనుము ఎక్కువగా లభ్యమయ్యే ఆకుకూరలు, పొట్టుధాన్యాలు, మాంసాహారం తరుచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం తప్పనిసరిగా చేయాలి. 
  • అధిక శాతం  రక్తహీనతకు గురి అవుతున్నారు. కాబట్టి రక్తహీనత నివారణకు ఏర్పడిన కొత్త మార్గం ఐరన్ కలిపిన ఉప్పును వినియోగించటం. సాధారణ ఉప్పుకు బదులు ఐరన్ ఉండే ఉప్పును రోజూ వంటలో వాడటం ద్వారా ఐరన్ లోపం వలన వచ్చే రక్తహీనతను నివారించవచ్చు. 
  • విటమిన్ బి12 తప్పనిసరి అవసరం. 
  • తాజా కూరగాయలలో, పాలకూర, క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అరటిపండు, యాపిల్, ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. 
  • అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు బాగా ఉపకరిస్తాయి.
  • భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగడం మానేయాలి. 
  • ఎండు ఫలాలు, పులుపు ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
రక్తహీనతను అశ్రద్ధ చేయవద్దు. అది కేవలం నీరసానికి మాత్రమే దారి తీయదు. ప్రాణహాని కూడా కలుగవచ్చు. అందుకే ఆహార నియమాలు పాటిస్తూనే వైద్యులను సంప్రదించడం సరైన పని.

Related

ladies health 863302702474107287

Post a Comment

emo-but-icon

Hot in week

Recent

4/comments/show

Comments

Side Ads

Text Widget

Connect Us

item