పాత పాటలతో ఒత్తిడి దూరం...

ApurupA
0
మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇప్పుడు అనేక మార్గాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొందరు యోగా చేస్తున్నారు. మరి కొందరు మెడిటేషన్‌లోకి దిగిపోతున్నారు. ఇంకొందరు ఉదయాన్నే నడక పని పెట్టుకుంటున్నారు. అయితే, ఎక్కువ మందికి పాత సినిమాల పాటలే ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం కలిగిస్తున్నట్టు ఇటీవల జరిపిన ఓ చిన్నపాటి సర్వేలో వెల్లడైంది. ఉదయమే పాత సినిమా పాటలు విని, రోజును ప్రారంభిస్తే రోజంత ఉల్లాసంగా ఉంటోందని వివిధ పార్కులు, వీధుల్లో ఉదయమే జరిపిన సర్వేలో తెలిసింది. కొందరు ఇంట్లోనే పాత పాటలు నాలుగైదు విని బయటికి వస్తుండగా, మరి కొందరు తమకు నచ్చిన పాటల్ని సెల్ ఫోన్లలోకి ఎక్కించుకుని వాటిని వింటూ రోడ్ల మీదా, పార్కుల్లోనూ ఓ గంటసేపు తిరుగుతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయ్ వంటి మహానగరాల్లో పాత సినిమా పాటలకు మళ్లీ గిరాకీ పెరిగింది.
  • ఇదివరకు రోజూ పొద్దున్నే కొద్ది సేపు మంచి పుస్తకం చదివితే మనసుకు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండేది. ఇప్పుడు ఉదయమే పది పదిహేను నిమిషాలు పాత పాటలు విన్నా, కీర్తనలు విన్నా హాయిగా ఉంటోంది. దీని ప్రభావం రోజంత ఉంటోంది కూడా. 
  • చక్కటి పాత పాటలు విన్నా, కీర్తనలు విన్నా మనసంతా దూదిపింజలా తేలికైపోతుంది. రోజంత ఆ పాటలే మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తుంటాయి. కూనిరాగాలు తీస్తుంటారు. ఎంతో హాయిగా, ఆనందంగా, శక్తిమంతంగా ఉంటోంది. కష్టపడుతున్న మన భావన కూడా వుండదు.
  • సంగీతంలోనే ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. అందులోనూ మనకు నచ్చిన శ్రావ్యమైన పాటలు విన్నా, కీర్తనలు విన్నా మనసెంతో ప్రశాంతంగా మారిపోతోంది. ఇదివరకూ దగ్గరలోని పార్కుకు వెళ్లి మార్నింగ్ వాక్ చేసే అలవాటున్న వారు ప్రస్తుతం ఇంట్లోనే చెట్ల మీద తిరుగుతూ సంగీతం వింటూ ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు.
  • ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇదివరకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, గ్రంథపఠనం, వాకింగ్, జాగింగ్, షికార్లు వగైరాలు చేసేవాళ్లు కూడా క్రమంగా పాత పాటల్ని వినడం అలవాటు చేసుకుంటున్నారు. వీలైతే ఆఫీసులో కూడా తరచూ పాటలు వినడం వల్ల మనసుకు ఎంతో ఉత్సాహం, ఉల్లాసం లభిస్తున్నాయి. శరీరంలో శక్తి పెరిగినట్టు అనిపిస్తోంది'' అని ఈ సర్వేలో దాదాపు ప్రతివారూ చెప్పారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top