రోజంతా అలసటగా ఉంటుందా? ఐతే ఈ టిప్స్ పాటించండి.!

ApurupA
0
రోజంతా అలసటగా ఉందా? అనారోగ్య సమస్యలతో అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా? ఎక్కువ పనిచేయకపోయినా అలసట ఆవహిస్తుంటే.. ఆరోగ్యంపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శరీరంలో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉన్నా.. ఎనర్జీ లేకపోయినా అలసట తప్పదు.

ఇంకా రోజంతా అలసట, నీరసంగా ఉన్నట్లైతే అది గుండె సంబంధిత రోగాలకు గుర్తని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడంతో పాటు శరీరంలోని బ్లడ్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా హృద్రోగ వ్యాధులకు దారి తీస్తుంది. 8 గంటల నిద్రకు తర్వాత చురుగ్గా పనిచేయాలంటే తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారంలోనే రోజంతా పనిచేసేందుకు కావలసిన పోషకాలున్నాయి.
 అయితే సింపుల్‌‍గా టైమ్ లేదనో ఇతరత్రా కారణాల చేత టిఫిన్ తీసుకోకుండా పోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుచేత అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.  దీనితో పాటు
  • నీరు ఎక్కువగా తీసుకోవాలి. 
  • జంక్ ఫుడ్‌ తీసుకోవడాన్ని నివారించాలి. 
  • రోజుకు అరగంటైనా వ్యాయామం చేయాలి. 
  • రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలి. 
  • హాలీడేస్ లోనూ ఇదే సమయాన్ని ఫాలో చేయాలి. 
  •  సమయానికి ఆహారం తీసుకోవాలి. 
  • ఉద్వేగానికి లోనుకాకూడదు. 
  • ఒత్తిడిని దూరంగా ఉంచి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. 
  • విటమిన్ బి12 లోపం ఉంటే అలసట ఆవహిస్తుంది. అందుచేత వారానికి రెండుసార్లు పరిమితంగా మాంసాహారం తీసుకోవాలి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top