ఫ్రూట్ సలాడ్
కావలసినవి :
ద్రాక్షపళ్ళు - 1 కప్పు
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
అరటిపండు ముక్కలు - 1 కప్పు
చెర్రీ పండ్లు - 1/2 కప్పు
మామిడిపండు ముక్కలు - 1 కప్పు
ఆపిల్ పండు ముక్కలు - 1 కప్పు
కమలాతొనలు - 1 కప్పు
మిరియాలపొడి - 1/2 స్పూన్
ఉప్పు - కొంచెం
తేనె - 1/4 కప్పు
నిమ్మ రసం - 2 స్పూన్లు
తయారు చేసే విధానం :
ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధం. ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీనివలన శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి.