రక్తహీనత (ఎనీమియాను నివారించాలంటే..

శరీరంలో హెమోగ్లోబిస్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే మన శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అయితే ప్రతి నెల నెలసరి సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి శరీరంలో రక్తకణాలు పెంచుకోవాలసిన ఆవశ్యకత ఎంతయిన ఉంది. మరి దీనికోసం ఏం చేయాలాంటే...


  • ఎనీమియాతో బాధపడుతున్న వారు ఆకుపచ్చగా, తాజాగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఎందుకంటే వీటిలో ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. శరీరంలో హెమోగ్లోబిస్ శాతం కూడా ఎక్కువవుతుంది. అలాగే యాపిల్, ద్రాక్ష, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష.. మొదలైన పండ్లు తినడం వల్ల హెమోగ్లోబిస్ పెరుగుతుంది. 


  • బీట్ రూట్, క్యారట్ మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఐరస్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో రక్త కణాలను పెంచుతుంది. 
  • ఏదో జ్వరం వచ్చినప్పుడో లేదా ఇతర ఆరోగ్య సమస్యలేైనా ఎదురైనప్పుడో గానీ బ్రెడ్ జోలికి వెళ్లం! కానీ బ్రెడ్ తినడం వల్ల మన శరీరంలో రక్తం పెరుగుతుందనే విషయం చాల మందికి తెలియదు. ముఖ్యంగా గర్భిణులు బ్రెడ్ తో పాటు తృణధాన్యాలు, ఓట్ మిల్ ప్రతి రోజూ ఆహారంలో బాగం చేసుకుంటే శరీరానికి కావలసిన ఐరస్ అందుతుంది. 


  • గుడ్డులో ఐరస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది. 
  • చికెస్, మటస్, చేపలు.. మొదలైన వాటిల్లో ఐరస్ అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటివల్ల రక్తంలో హెమోగ్లోబిస్ స్ధాయిలు రెట్టింపవుతాయి. కానీ మాంసాహారం మరీ ఎక్కువగా తినకపోవడం మంచిది. శరీరంలో రక్తం పెరుగుతుంది కదా అని మోతాదుకు మించి తిన్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు రోజూ తినాలనుకుంటే మాత్రం కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం తీసుకోవడం మంచిది. 
  • అలాగే కొద్ది మొత్తంలో ఐరస్ లభించే గింజ ధాన్యాలనూ ఆహారంలో బాగం చేసుకోవాలి. 
  • శరీరంలో రక్తం పెరగాలంటే ఐరస్ ఎక్కువగా లభించే బాదం తినడం చాల ముఖ్యం. కాబట్టి ఇప్పటి నుంచైన వీటిని మీ ఆహారంలో బాగం చేసుకుంటే మంచిది. 
  • ఆకుకూరలు, క్యాబేజి, క్యాలీఫ్లవర్, స్వీట్ పొటటో.. మొదలైనవన్నీ హెమోగ్లోబిస్ శాతం పెరగడంలో సహాయపడతాయి. 
  • మనం తినే ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించాలంటే విటమిస్ సి ఎక్కువగా లభించే ఆహారం, పానీయాలు తీసుకోవాలి. ఉదాహరణకి ఆరెంజ్ జ్యూస్ ఇది ఆహారంలోని ఐరస్, దాని సప్లిమెంట్ నున శరీరం గ్రహించేందుకు తోడ్పడుతుంది.


Related

health articles 6585829172954221056

Post a Comment

emo-but-icon

Hot in week

Recent

4/comments/show

Comments

Side Ads

Text Widget

Connect Us

item