కొన్ని సందర్భాల్లో శరీరానికి పడని ఆహారం తీసుకోవడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాదు.. ఫలితంగా పోట్ట ఉబ్బడం, అసౌకర్యంగా అనిపించడం, చెమట పట్టడం, ఆయాసం.. మొదలైన సమస్యలు ఎదురవుతాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదమూ వుంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సమయానికి డాక్టర్, మందులు అందుబాటులో లేకపోతే.. మరేం భయం లేదు.. ఈ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఈ వంటింటి చిట్కాలు పాటించి చూడండి...
- అరటిపండులో ఉండే పెక్టిస్ వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడం, జీర్ణవ్యవస్థలో ఏమైన లోపాలుంటే తొలగిపోవడం.. వంటివి జరుగుతాయి. అలాగే విరేచనాల సమస్యను తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది. ఇది శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది.
- తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతులయ్యేల ఉండడం, విరేచనాలు.. మొదలైన సమస్యలన్నింటికీ దివ్య ఔషధం అల్లం టీ. ఇది తాగితే సమస్యలన్నీ తొలగిపోతాయి.
- పెరుగులో ఆహారం జీర్ణమవడానికి తోడ్పడే ఎంజైమ్స్ ఉంటాయి. దీనిలో ఉండే బ్యాక్టీరియా జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక చిన్న కప్పుడు పెరుగు తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించి ఎలంటి సమస్యలు రావు.
- విరేచనాలతో బాధపడే వారికి లెమస్ ట మంచి ఉపశమనాన్నిస్తుంది. పాలు, పంచదార లేకుండా తయారు చేసిన టీ డికాషన్ లో నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
- పీచుపదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యానికి చాల అవసరం. అల అన్నాం కదా అని మొత్తం ఫైబరే ఉండే పదార్థాలే తీసుకోమని కాదు.. శరీరానికి అవసరమైనంత మొత్తంలో ఫైబర్ లభించేల జాగ్రత్త పడాలి.
- కొన్నిసార్లు ఎక్కువ కొవ్వు ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు అది త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా అజీర్తి సమస్య ఎదురవుతుంది. కాబట్టి ఎక్కువ ఫ్రై చేసిన పదార్థాలు, కొవ్వులున్న పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- బేకింగ్ సోడా కూడా జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అదెలగంటే.. అర గ్లాసు నీటిలో అర టీ స్పూస్ బేకింగ్ సోడా వేసి కలుపుకొని తాగితే తగిన ఫలితం ఉంటుంది.
- బొప్పాయిలో ఉండే పపేస్, చిమోపపేస్ అనే రెండు ఎంజైమ్స్ లు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపకరిస్తాయి. అలాగే కడుపు పట్టేయటం నుంచి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ పండు జీర్ణవ్యవస్థలో ఎసిడిక్ స్ధాయుల్ని పెంచడంలో తోడ్పడుతుంది.
- నీటిని ‘సర్వరోగ నివారిణి అనడం మనకు తెలిసిందే. రోజూ తగినంత నీరు తాగడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- ఒక కప్పులో ఒక టీ స్పూన్ సోంపు లేదా ఎండబెట్టిన పుదీనా ఆకుల్ని తీసుకుని దానికి ఒక కప్పు బాగా మరిగించిన నీటిని కలపాలి. దానిపై మూతపెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి. ఇలా రోజుకు మూడు కప్పులు పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- జీర్ణ సంబంధిత సమస్యలకు ఒక్కోసారి ఒత్తిడి కూడా కారణం కావచ్చు. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో.. ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో వ్యాయామం, యోగా, మెడిటేషస్ చేయడమూ అంతే ముఖ్యం. వీటివల్ల కేవలం ఒత్తిడి తగ్గటమే కాదు.. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
- జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని తొలగించడంలో దాల్చిన చెక్క కూడా ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో పావు లేదా అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత తాగితే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.