‘హైపో థైరాయిడిజం’

ApurupA
0
థైరాయిడ్ గ్రంథుల నుంచి థైరాయిడ్ హార్మోన్లు థైరాక్సిస్(టీ4), ట్రియోడోథైరోనైన్(టీ3), సక్రమంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య ఎదురవుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది పరిష్కరించడానికి వీలుగా ఉండే సమస్యే అయినా చాలామంది తమకు ఈ సమస్య ఉన్నట్లు గుర్తించలేరు.
ఈ సమస్య నివారించడానికి ఆహారం విషయంలో పాటించవలసిన కొన్ని సలహాలు...
  • టీ4 హార్మోను సక్రమంగా ఉత్పత్తి కావడానికి రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. వీటితో పాటు మంచి పౌష్టిక ఆహారం తిసుకోవడం, వ్యాయామం చేయడం తప్పనిసరి.
  • అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవడం వల్ల జీవక్రియల స్థాయి యథాస్థానానికి చేరుకుంటుంది.
  • తీసుకునే ఆహారంలోని క్యాలరీలు ఎక్కువైనా అధిక బరువు తప్పదు. మైదా, ప్రాసెస్ చేసిన ఆహారం, పంచదారతో చేసినవి, అన్ని రకాల శుద్ధి చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం చాల మంచి పద్ధతి.
  • థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరిచేందుకు పాలకూర, ముల్లంగి, క్యాబేజీ, బ్రొకొలి వంటివి ఆహరంలో తీసుకోవాలి. కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గిస్తే మంచిది. అంటే రోజూ మీరు తీసుకునే ఆహారంలో 20 నుంచి 30 శాతం క్యాలరీల మేరకు మాత్రమే కొవ్వు పదార్థాల నుంచి అందాలి.
  • మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పాలు, చేపలు, చికెన్, కోడిగుడ్డు లాంటి ఆహారం తీసుకోవాలి. ఇవి కూడా 10 నుంచి 15 శాతం క్యాలరీల్లో మాత్రమే ఉంటే మంచిది.
అలాగే ఆహారంలో నిత్యం తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం తప్పనిసరి. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుంది. అన్ని రకాల పోషకాలు అందేందుకు సప్లిమెంట్స్ తీసుకోవడం తప్పనిసరి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top