పీచుపదార్థం సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర శాతం అదుపులో ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాల బాగా ఉపయోగపడుతుంది. అన్ని వయసుల వాళ్లూ దీన్ని అల్పహారం రూపంలో తీసుకోవచ్చు. ఓట్స్తో జావ లాంటివి చేసుకోని తినవచ్చు, లేదంటే దోశ, చపాతీ, ఇడ్లీ, ఉప్మాలలో చేర్చుకోవచ్చు. ఓట్స్లో సెలినియం అనే ఖనిజ లవణం ఎక్కువగా లభిస్తుంది. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణలు అదుపులో ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ని నివారించడంలో ఓట్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. గుండె సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలకు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. వంద గ్రాముల ఓట్స్ ద్వారా 389 క్యాలరీలు, 11 గ్రాముల ఫైబర్, 17 గ్రాముల ప్రొటన్లు, 7 గ్రాముల ఫ్యాట్ అందుతాయి. ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి పీచుపదార్థం ఎక్కువగా అందుతుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.