వానాకాలం ఆహర నియమాలు....

ApurupA
0
వానాకాలంలో ఎంత జాగ్రత్త పడినా తడవడం మాత్రం తప్పదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు తరచూ వేదిస్తుంటాయి. వీటిని నివారించడానికి మనం తీనే ఆహర పదార్ధల విషయంలో కోన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే

అనారోగ్యాలను తగ్గించడానికి ఆహార నియమాలు తప్పకుండా ఉపయోగపడతాయి.
వానకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం పరిశభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల భారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అందుచేత ఈ సమయంలో బయటకు వెళ్లిన ప్రతి సారి సబ్బుతో చేతులు శుభ్ర పరుచు కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా జాగ్రత్త పడొచ్చు. 
జలుబుతో బాధ పడుతున్న వారితో కలిసి పానీయాలు, లిప్ స్టిక్ లు, ఇతర వస్తువులు పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో చేతులను శభ్ర పరుచుకుంటే క్రిములు నశిస్తాయి. 
ఇవి కాకుండా.. 
  • తాజా పండ్లు, కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. వాటిని కూడా శభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
  • పండ్ల రసాలు, సలాడ్లను సిద్ధం చేసుకున్న వెంటేనే అప్పటికప్పుడే తీసుకోవాలి. 
  • సాధ్యమైనంత వరకు ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరి. 
  • పెరుగు, మజ్జిగ లాంటి వాటినీ తాజాగా మాత్రమే తీసుకోవాలి. 
  • ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు బాగా కడిగి, ఉడకనిచ్చిన తర్వాతే తినాలి. 
  •  జలుబు, దగ్గు తదితర సమస్యలకు పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి. రంగురంగుల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్, బీటెకరోటీస్, విటమిస్ ఇ, విటమిస్ సి, సెలీనియం సమృద్ధిగా అందుతాయి. పెరుగులోని బ్యాక్టీరియా కూడా జలుబు నుంచి సంరక్షిస్తుంది. 
  • కర్బూజా, ఆప్రికాట్ల గుజ్జు, తాజా పెరుగు, మంచినీళ్లు, టమాట రసం, సూపులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఎక్కువగా నీటిని చేర్చి తీసుకోవడం అలావా చేసుకోవాలి. 
  • మొలకెత్తిన తాజా గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 
  • మాంసాహారం, కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీని వల్ల శ్యాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. 
  • జలుబు కారక క్రిములను నివారించే సి విటమిస్ నిమ్మకాయలో ఉంది కాబట్టి నిమ్మ జాతి పండ్లయిన బత్తాయి, ఆరెంజ్ వంటివి సమృద్ధిగా తీసుకోవాల్సి ఉంటుంది.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top