ఈ పోషకాల లోపంతో నిద్ర లేమి కలిగే అవకాశం

ApurupA
0
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ప్రస్తుతం ఎంతోమందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. నిద్ర సరిగా పట్టక పోవటానికి ఒత్తిడి వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి గానీ.. కొన్ని రకాల పోషకాలు లోపించినా నిద్ర లేమికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 
పొటాషియం:
నాడులను, కండరాలను నియంత్రించే ఈ పోషక లోపంతో నిద్ర పట్టడంలో ఇబ్బందులూ తలత్తుతాయి. అరటిపండులో పొటాషియం చాల ఎక్కువగా (రోజుకు అవసరమైన మోతాదులో 10 శాతం) ఉంటుంది. అలాగే పొట్టు తీయని ధాన్యాలు, మాంసం, బీన్స్, ఆకుకూరలు, ఉడికించిన ఆలు గడ్డలతోనూ ఇది బాగా లభిస్తుంది.
మెగ్నీషియం : 
ఇది నిద్రను నియంత్రించే ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం మూలంగా కనబడే లక్షణాల్లో నిద్ర పట్టక పోవడమూ ఒకటి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు మెగ్నీషియం దండిగా ఉండే పదార్థాలు తినడం మేలు. ఆకు కూరలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, బీన్స్, కొన్ని రకాల చేపల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డి: 
ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి దోహదం చేసే విటమిన్ డి లోపం మూలంగా నిస్సత్తువ, పగటిపూట మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో రాత్రిపూట కునుకుపట్టడం కష్టమవుతుంది. రోజూ కాసేపు ఎండలో నిలబడితే మన శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం హడావుడి జీవితంలో చాలమంది దీన్ని పట్టించుకోవడం లేదు. సాల్మన్, సార్డైన్, టూనా వంటి చేపలు, గుడ్డు పచ్చసొనతో కొంత వరకు విటమిన్ డి అందుతుంది. 
తీవ్ర మానసిక సమస్యలకు మందులు వాడుతుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని కూడా వ్యాయామం, జీవనశైలి మార్పులతో తగ్గించుకోవచ్చని పలు అధ్యయనలలో తేలింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top