దంతాలు, చిగుళ్ల శుభ్రతతో మతిమరుపు దూరం...

ApurupA
0
తెల్లగా మెరిసే దంతాలు అందాన్నికే కాదు ఇవి జ్ఞాపకశక్తిని కాపాడటానికీ తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. దంతాల, చిగుళ్ల శుభ్రతకూ అల్జీమర్స్ జబ్బుకూ సంబంధం ఉంటోందని తేలడమే దీనికి నిదర్శనం. తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) బరిన పడిన వారు చనిపోయిన తర్వాత వారి మెదడు కణజాలంపై పరిశోధకులు ఇటివల ఒక అధ్యయనం చేశారు. 
డిమెన్షియా బాధితుల మెదళ్లలో పి.జింజివలి అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు ఇందులో తేలింది. తీవ్ర చిగుళ్ల వాపు జబ్బుకు దోహదం చేసే పి.జింజివలి బ్యాక్టీరియా మనం  భోజనం చేసినప్పుడో, పళ్లు తోముకుంటున్నప్పుడో రక్త స్రాహంలో కలిసి, అక్కడి నుంచి అది మెదడుకు చేరుకుంటునట్లు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మెదడుకు చేరుకోని అక్కడ రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తోందని భావిస్తున్నారు. దీంతో మెదడు కణాల నుంచి విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా మీదనే కాదు, నాడీ కణాలు మీదా దాడిచేసి వాటిని దెబ్బతీస్తాయి. ఇది చివరికి డిమెన్షియాకు దారితీస్తుంది. కాబట్టి దీని బరిన పడకుండా ఉండాలంటే నోటి శుభ్రత లో అలసత్వం ఉండకుడదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top