ఒకటి రెండు గంటలు కూర్చోగానే ఒకసారి లేచి కొద్దిగా అడుగులు వెయ్యడం, అటు ఇటు తిరగడం చాల అవసరం. అలా చేయకపోతే వెన్ను
పూసలు, డిస్క్ లు అరిగిపోయే ప్రమాదం ఉంది. సైకిల్ను సరిగా పట్టించుకోకపోతే తుప్పు పట్టినట్టే, నడుము పూసలు, డిస్కులు కూడా అంతే. డిస్కులు వయసుతో పాటు క్షీణించే అవకాశం ఉన్నా మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సాధ్యమైనంత ఎక్కువకాలం వాయిదా వెయ్యవచ్చు.
ఈ రోజుల్లో చాలమందికి రోజంతా అస్సలు వ్యాయామం చేసే అవకాశం ఉండడం లేదు. ఆఫీస్ లేదా ఇంటిలో ఎప్పుడు
కూర్చునే తమ పనులు చేసుకుంటున్నారు. ఇలా ఎక్కువ సేపు కూర్చువడం
వల్ల డిస్కుల మీద అత్యధిక భారం పడుతుంది. నడక వల్లగానీ, పనుల వల్లగానీ, సైక్లింగ్ వల్లగానీ డిస్కుల మీద భారం పడదు. ఎప్పుడూ కూర్చునే ఉండం వల్ల డిస్కుల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీంతో అవి త్వరగా క్షీణించడం ఆరంభిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కండరాలు బలపడేల నడుముకు సంబంధించిన వ్యాయామాలు చేస్తుండాలి. కండరాలు బలపడితే భారాన్ని అవి పంచుకుంటాయి. పూసలు-డిస్కుల మీద ఒత్తిడి తగ్గుతుంది. కదలికలు లేనప్పుడు, డిస్కులు త్వరగా క్షీణించి అవకాశం ఉంది కాబట్టి మెడ-నడుము నొప్పులు రాకుండా ఉండాలంటే నిత్యం మెడ, నడుముకు సంబంధించిన ప్రాథమిక కదలికలు ఉండే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తూండాలి. ఇవన్నీ చేసినా కొందరికి డిస్కులు క్షీణిస్తే అప్పుడు వైద్య నిపుణుల సలహా మేరకు మందులు, ఇంజక్షన్లు వంటి మార్గాలకు వెళ్ళవలసి వస్తుంది.