ఒత్తిడిని తగ్గించే ఆహరం

ApurupA
0
చదువులు కావచ్చు.. పోటీ పరీక్షలు కావచ్చు.. విద్యార్థుల మీద రకరకాల ఒత్తిళ్లుంటాయి. అలాంటప్పుడు యోగా, ధ్యానం చాలు అని చాలామంది అంటారు. అవే కాదు... ఆహారంతోనూ ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

విటమిన్‌ 'సి': ఈ విటమిన్‌లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంటుంది. నారింజ, అనాస, టొమాటో, జామలో ఇది ఉంటుంది. మానసికంగా చిరాగ్గా, విసుగ్గా ఉన్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.  

అరటిపండు: ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో అరటి పండు ఒకటి. ఓ చిన్న పండును తింటే సరిపోతుంది. అందులో తక్కువ కెలొరీలు లభించడమే కాదు, శరీరానికి అవసరమైన చక్కెర ఆ చిన్న పండు ద్వారా అందుతుంది. 
అంతేకాదు మెదడుకు మేలు చేసే సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండటం సాధ్యమవుతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది. 

నట్స్‌: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసికంగానూ దృఢంగా మారతారు. ఉద్యోగినులూ, విద్యార్థినులూ వెంట ఎప్పుడూ డ్రై ప్రూట్స్‌ ఉంచుకుంటే సరిపోతుంది. అలవాటుగా మార్చుకుంటే ఇంకా మంచిది. ఒత్తిడిగా అనిపించినప్పుడు తిన్నా అది దూరమవుతుంది. 

ఓట్స్‌: ఇవి మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఓట్స్‌తో చేసిన బిస్కెట్లు, చిక్కీలు తినడం మంచిది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరం కూడా వీటిని త్వరగా గ్రహిస్తుంది. ఓట్స్‌ తేలికపాటి ఆహారం కావడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలూ రావు.

చేప నూనె: ఎక్కువగా ఒత్తిడికి గురై, టెన్షన్లు ఎదుర్కొనేవాళ్లు..వంటకు మామూలు నూనెకు బదులు, చేప నూనెను ఎంచుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్‌ ఈ ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. విద్యార్థులు దీనికి ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top