
మోనోసాచ్యురేటెడ్ కొవ్వు, పొటాషియం:
ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాలు ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వు.. అరటిపండు, చిలగడ దుంపల్లో బాగా పొటాషియం లభిస్తాయి.
ట్రైప్టోఫాన్:
మూడ్‌ని నియంత్రించటంలో సెరటోనిన్ పాత్ర చాలా కీలకం. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్ ఎక్కువగా లభించాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు:
మానసిక ఏకాగ్రత, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ కొవ్వులు లోపించటం వల్ల కుంగుబాటు, చిరాకు బాధించే అవకాశం ఉంది. అందుకే వీటిని పొందాలంటే ఆకుకూరలు.. చేపలు.. అవిసెగింజలు తీసుకుంటే మేలు.
ఫోలిక్ యాసిడ్, బి6 విటమిన్:
కుంగుబాటుని దూరం చేసేందుకు ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో దండిగా ఉంటాయి.
కుంగుబాటుని దూరం చేసేందుకు ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో దండిగా ఉంటాయి.