రాత్రివేళ ఉద్యోగం చేసే వారిలో ఆరోగ్యం
దెబ్బతింటుందా? అవుననే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ కాలంపాటు రాత్రివేళల్లో
విధులు నిర్వహించిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉంటున్నట్లు తాజా అధ్యయనంతో
తేల్చారు.
రాత్రి వేళల్లో మేల్కొని ఉన్నప్పుడు
శరీరంలోని హార్మోన్లపై ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ
కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్‌పై
ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు
స్పష్టం చేస్తున్నారు. సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద,
లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్
విడుదలను ఆపేస్తుంది. పలురకాల విధులు నిర్వర్తించే మెలటోనిన్ హార్మోన్ మన
శరీరంలో జీవ గడియారం పనిచేసేలా చేస్తూ, పగటివేళ
మెలకువగా ఉండేలా, రాత్రివేళ నిద్రపోయేలా
నిర్దేశిస్తుంటుంది. అంతేకాదు, క్యాన్సర్ నుంచి రక్షణ అందించటంలోనూ ఈ
హార్మోన్‌దే కీలకపాత్ర.
మెలటోనిన్.. రక్తంలో ఈస్ట్రోజన్‌ను
తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్ రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపిస్తుంది.
అలాంటి ఈస్ట్రోజన్‌ను తగ్గించగలిగే సామర్థ్యమున్న మెలటోనిన్ విడుదల రాత్రివేళ
డ్యూటీల కారణంగా తగ్గిపోవటం వల్లే క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు
అంటున్నారు. మెలటోనిన్.. క్యాన్సర్ కణాల పెరుగదలనూ నిరోధిస్తుంది. కణాల్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను దెబ్బతీయటం ద్వారా రోగనిరోధక
వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. మామూలుగా మన మెదడు మెలటోనిన్‌ను ఎక్కువగా మధ్యరాత్రి
వేళల్లో వాతావరణం చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది. అందుకని, కృత్రిమ వెలుతురు కింద పని చేసేవారి శరీరాల్లో మెలటోనిన్ తక్కువగా
ఉత్పత్తి అవుతుంది. 'రాత్రి విధుల కారణంగా తలెత్తే అనారోగ్య
ముప్పును ప్రజారోగ్య సమస్యగా భావించాల్సిన అవసరం ఉందని' స్టిర్లింగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
రాత్రి విధుల వల్ల రొమ్ము క్యాన్సర్ ఒక్కటే కాకుండా, పలురకాల అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందన్నారు. ప్రొస్టేట్,
గర్భాశయ క్యాన్సర్ కూడా రావచ్చన్నారు.
డెన్మార్క్ పరిశోధనలో రాత్రివేళ డ్యూటీల్లో ఉండే మహిళలకు బరువు తక్కువ బిడ్డలు
పుట్టినట్లు తేల్చారు. రాత్రివేళ ఉద్యోగం చేసేవారి ఆహార అలవాట్లు సక్రమంగా ఉండనందు
వల్ల జీర్ణ సమస్యలు, పేగు క్యాన్సర్ సమస్యలు ఎక్కువేనని
మరికొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. అయితే.. రొమ్ము క్యాన్సర్ ముప్పుకు రాత్రి డ్యూటీలనే పూర్తిగా కారణంగా చూడలేమనీ, ఇతరత్రా అంశాలూ తోడవ్వచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. శారీరక
శ్రమ తక్కువగా ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందనే
సంగతి ఇప్పటికే పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఇలాంటి వారిలో వ్యాయామం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుంది. మహిళలకు రాత్రి విధులు హానికరమా?
రాత్రివేళ ఉద్యోగం చేసే వారిలో ఆరోగ్యం
దెబ్బతింటుందా? అవుననే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ కాలంపాటు రాత్రివేళల్లో
విధులు నిర్వహించిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉంటున్నట్లు తాజా అధ్యయనంతో
తేల్చారు.
రాత్రి వేళల్లో మేల్కొని ఉన్నప్పుడు
శరీరంలోని హార్మోన్లపై ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ
కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్‌పై
ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు
స్పష్టం చేస్తున్నారు. సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద,
లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్
విడుదలను ఆపేస్తుంది. పలురకాల విధులు నిర్వర్తించే మెలటోనిన్ హార్మోన్ మన
శరీరంలో జీవ గడియారం పనిచేసేలా చేస్తూ, పగటివేళ
మెలకువగా ఉండేలా, రాత్రివేళ నిద్రపోయేలా
నిర్దేశిస్తుంటుంది. అంతేకాదు, క్యాన్సర్ నుంచి రక్షణ అందించటంలోనూ ఈ
హార్మోన్‌దే కీలకపాత్ర.
మెలటోనిన్.. రక్తంలో ఈస్ట్రోజన్‌ను
తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్ రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపిస్తుంది.
అలాంటి ఈస్ట్రోజన్‌ను తగ్గించగలిగే సామర్థ్యమున్న మెలటోనిన్ విడుదల రాత్రివేళ
డ్యూటీల కారణంగా తగ్గిపోవటం వల్లే క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు
అంటున్నారు. మెలటోనిన్.. క్యాన్సర్ కణాల పెరుగదలనూ నిరోధిస్తుంది, కణాల్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను దెబ్బతీయటం ద్వారా రోగనిరోధక
వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. మామూలుగా మన మెదడు మెలటోనిన్‌ను ఎక్కువగా మధ్యరాత్రి
వేళల్లో వాతావరణం చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది. అందుకని, కృత్రిమ వెలుతురు కింద పని చేసేవారి శరీరాల్లో మెలటోనిన్ తక్కువగా
ఉత్పత్తి అవుతుంది. 'రాత్రి విధుల కారణంగా తలెత్తే అనారోగ్య
ముప్పును ప్రజారోగ్య సమస్యగా భావించాల్సిన అవసరం ఉందని' స్టిర్లింగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
రాత్రి విధుల వల్ల రొమ్ము క్యాన్సర్ ఒక్కటే కాకుండా, పలురకాల అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందన్నారు. ప్రొస్టేట్,
గర్భాశయ క్యాన్సర్ కూడా రావచ్చన్నారు.
డెన్మార్క్ పరిశోధనలో రాత్రివేళ డ్యూటీల్లో ఉండే మహిళలకు బరువు తక్కువ బిడ్డలు
పుట్టినట్లు తేల్చారు. రాత్రివేళ ఉద్యోగం చేసేవారి ఆహార అలవాట్లు సక్రమంగా ఉండనందు
వల్ల జీర్ణ సమస్యలు, పేగు క్యాన్సర్ సమస్యలు ఎక్కువేనని
మరికొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. అయితే.. రొమ్ము క్యాన్సర్ ముప్పుకు రాత్రి డ్యూటీలనే పూర్తిగా కారణంగా చూడలేమనీ, ఇతరత్రా అంశాలూ తోడవ్వచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. శారీరక
శ్రమ తక్కువగా ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందనే
సంగతి ఇప్పటికే పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఇలాంటి వారిలో వ్యాయామం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుంది.