మనం నీళ్లు ఎంత తాగితే అంత మంచిదనీ, రోజుకు 4-5 లీటర్త్లెనా తాగితే ఒంట్లో మలినాలు కొట్టుకుపోతాయనీ చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సమస్యలు తెచ్చిపెట్టే నమ్మకం!
నీరనేది కేవలం మనం తాగే నీళ్ల రూపంలోనే కాదు.. పండ్లు, కూరగాయలు, అన్నం, చారు, మజ్జిగ.. ఇలా అన్నింటిలోనూ ఉంటుంది. చాలామంది దీన్ని గుర్తించరు. ఇలాంటి పదార్థాల ద్వారా కాకుండా మనం రోజు మొత్తమ్మీద 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగితే చాలు! అంతకంటే ఎక్కువ తాగితే శరీరంలోని స్రావాలన్నీ పల్చబడిపోయి వాటి పనిసామర్థ్యం బాగా తగ్గిపోతుంది. చాలామంది నిద్ర లేస్తూనే 2 లీటర్ల నీటిని తాగేసెయ్యాలని చెబుతుంటారుగానీ ఇలా ఎక్కువగా తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వెనకబడుతుంది. మనం తినే ఆహారానికి తగ్గట్టుగా ఎంజైముల వంటివి శరతాయి. కానీ మనం ఒక్కసారే నీళ్లు ఎక్కువగా తాగేస్తే అవన్నీ పల్చబడి, వాటి సామర్థ్యం తగ్గిపోతుంది.
ఆహారం తినేటప్పుడు మధ్య మధ్యలో కాకుండా మొత్తం తినటం పూర్తయిన తర్వాత తాగాలి. ఆ 2 లీటర్లు కూడా ఒక్కసారే ఎక్కువగా తాగటం కాకుండా రోజంతా వివిధ సందర్భాల్లో తాగుతుండటం ముఖ్యం. (కిడ్నీ సమస్యల వంటివి ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తాగాలి)