పొగ త్రాగడం మానేస్తే శుక్లాల ముప్పు లేనట్టే...

ApurupA
0
పొగతాగటం ఒక్క వూపిరితిత్తులనే కాదు. శరీరంలోని చాలా భాగాలనూ దెబ్బతీస్తుంది. ఈ అలవాటును ఎప్పుడు మానేస్తే అప్పట్నుంచే మంచి ఫలితం కనబడుతుందని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. దీన్ని
బలపరుస్తూ మరో రుజువూ లభించింది. పొగతాగే అలవాటు మానేస్తే కంట్లో శుక్లం ఏర్పడే ముప్పూ తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది. మన కంట్లో పారదర్శకమైన కటకం ఉంటుంది. దీనిలోంచి కాంతి కిరణాలు ప్రసరించి ఆయా దృశ్యాలు స్పష్టంగా కనబడతాయి. కానీ ఇది వృద్ధాప్యంలో మబ్బుమబ్బుగా (శుక్లం) మారిపోతుంది. దీంతో చూపు మసకబారుతుంది. ఇలా శుక్లం ఏర్పడటానికీ పొగ తాగే అలవాటుకూ గల సంబంధంపై స్వీడన్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యనం చేశారు. పొగ అలవాటు లేనివారితో పోలిస్తే.. రోజుకి 15 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగినవారికి శుక్లాల ముప్పు 42% అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే పొగ మానేసిన 20 ఏళ్ల తర్వాత శుక్లాల ముప్పు 21 శాతమే ఉంటుండటం గమనార్హం. పొగ తాగటానికీ ఇతర కంటి సమస్యలకూ సంబంధం ఉండటం వల్ల దీన్ని అలవాటు చేసుకోకపోవటమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ పొగ అలవాటుంటే దాన్ని మానేయటం ఉత్తమమని సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top